తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మీర్​పేట్​లో శంకర్​దాదా ఎంబీబీఎస్​.. చివరికి! - రంగారెడ్డి జిల్లా వార్తలు

హైదరాబాద్​లో మరో శంకర్​దాదా ఎంబీబీఎస్ బాగోతం బట్టబయలైంది. నకిలీ ధ్రువపత్రాలతో క్లీనిక్ నిర్వహిస్తున్న వైద్యుడిని మీర్​పేట్​​ పోలీసులు అరెస్ట్​ చేశారు. అతని వద్ద నుంచి వైద్య పరికరాలు, బోర్డును స్వాధీనం చేసుకున్నారు.

fake doctor arrested by meerpet police
నకిలీ వైద్యుడి ఆటకట్టించిన మీర్​పేట్​ పోలీసులు

By

Published : Dec 10, 2020, 2:59 PM IST

ఇంటర్​ చదివి వైద్యునిగా చెలామణి అవుతున్న పొల్కంపల్లి సాయికుమార్​ను మీర్​పేట్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో సాయిక్లీనిక్​ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఎంసెట్​ లాంగ్​టర్మ్​ కోచింగ్​ తీసుకున్న సాయికుమార్ సంతోశ్​నగర్​లోని శ్రీనివాస ఆస్పత్రిలో ఆరేళ్ల పాటు ఆపరేషన్​ థియేటర్​లో సహాయకుడిగా పనిచేసినట్లు తెలిపారు. అతని వద్దనుంచి ఒక స్టెతస్కోప్, బీపీ పరికరం, రబ్బర్​ స్టాంప్​, బోర్డుతోపాటు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:అమెరికా నుంచి ఫోన్​లో ట్రిపుల్ తలాక్...

ABOUT THE AUTHOR

...view details