మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన డాక్టర్ పేరుతో నకిలీ ధ్రువపత్రాల సృష్టించి వైద్య వృత్తిని కొనసాగిస్తున్న మోసగాడిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన మంగం కిరణ్ కుమార్ ఓ ఆయుర్వేద వైద్యుడి వద్ద కాంపౌండర్‌గా పని చేశాడు. 2013లో సొంతంగా ఓ క్లినిక్ ఏర్పాటు చేసుకున్నాడు.
పాన్ కార్డుతో నకిలీ వైద్యుడి గుట్టురట్టు
తన పేరుకు దగ్గర్లో ఉన్న ఓ వైద్యుడి ధ్రువపత్రాలను అంతర్జాలంలో సేకరించాడు ఓ వ్యక్తి. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు సంపాదించి వైద్యుడిగా చెలామణి అవుతున్నాడు. కట్ చేస్తే పాన్ కార్డుతో నకిలీ వైద్యుడి అసలు రంగు బయటపడింది.
ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ముక్కు కిరణ్ కుమార్ ధ్రువపత్రాలను అంతర్జాలం ద్వారా సేకరించి... నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డులను సంపాదించాడు. నకిలీ ధ్రువపత్రాలతో ఏపీలోని పలు ఆస్పత్రుల్లో వైద్యుడిగా పని చేశాడు. పాన్ కార్డు కోసం హైదరాబాద్‌కు చెందిన డా.ముక్కు కిరణ్ కుమార్ దరఖాస్తు చేసుకోగా... అప్పటికే తన పేరుపై పాన్ కార్డు జారీ అయిందని తెలుసుకొని కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలా నకిలీ వైద్యుడి అసలు విషయం బయటపడింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కూకట్పల్లి సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి:దొంగల బీభత్సం.. ఏటీఎంలో చోరీకి విఫలయత్నం