సులభంగా డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో నకిలీ ధ్రువపత్రాలను సృష్టిస్తున్న ముఠాను హైదరాబాద్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13 పదో తరగతి నకిలీ సర్టిఫికేట్లతో పాటు, లాప్టాప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మచ్చెందర్ అనే వ్యక్తి రైల్వేలో ఎలక్ట్రీషన్‌గా పనిచేస్తున్నాడు. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి సంతోశ్ అనే వ్యక్తితో కలిసి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ పేరుతో నకిలీ ఎస్ఎస్సీ ధ్రువపత్రాలను తయారు చేస్తున్నారు.
నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టు రట్టు... ఒక్కోటి రూ.2 లక్షలటా! - habsiguda news
హైదరాబాద్ హబ్సీగూడలో నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13 పదో తరగతి నకిలీ సర్టిఫికెట్లతో పాటు, లాప్టాప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హబ్సిగూడ కేంద్రంగా సాగుతున్న ఈ దందాలో ఒక్కో సర్టిఫికెట్ రూ.2 లక్షల వరకూ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మచ్చేందర్ వద్ద నకిలీ ధ్రువపత్రాలు తీసుకున్న సంతోశ్, జయంత్, రాజేష్‌కు పోస్టల్ శాఖలో ఉద్యోగాలు లభించాయి. వారి ధ్రువపత్రాలను పరిశీలించగా... అవి నకిలీవని తేలాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ముఠా గుట్టు రట్టయింది.
పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చాలా మంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.