యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని మచ్చుపహాడ్‌లో రెండు రోజుల క్రితం పీడీఎఫ్ బియ్యాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. జనగామ జిల్లా బచ్చనాపేట మండలం గోపాల్‌నగర్ చెందిన ఐదుగురు వ్యక్తులు కొడవటుర్ కామన్ వద్ద వారి వాహనాన్ని ఆపారు. పోలీసులమని పరిచయం చేసుకుని అక్రమంగా బియ్యం తరలిస్తున్నారని కేసు నమోదు చేస్తామని బెదిరించారు.
నకిలీ పోలీసుల అరెస్ట్.. రూ.33 వేలు స్వాధీనం - latest crime news in yadadri bhuvanagiri district
పోలీసులమని చెప్పి డబ్బులు వసూలు చేసిన ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 33 వేల నగదు, 4 చరవాణులు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు.
![నకిలీ పోలీసుల అరెస్ట్.. రూ.33 వేలు స్వాధీనం fack police arrested in yadadri bhuvanagiri distirct](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8606913-91-8606913-1598710863320.jpg)
నకిలీ పోలీసుల అరెస్ట్.. రూ.33 వేలు స్వాధీనం
50 వేలు డిమాండ్ చేశారు. భయపడిన బాధితులు రూ.35 వేలు చెల్లించారు. ఇంకా కావాలని డిమాండ్ చేయటంతో మరో 10 వేలు తెలిసిన బంధువులను అడిగి గూగుల్ పే ద్వారా చెల్లించారు. అనంతరం పోలీసులు ఎందుకు ఇలా చేశారని విచారించగా వాళ్లు నకిలీ పోలీసులని తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులు చెన్నయ్య, మధుకృష్ణ, మహేందర్, కరుణాకర్, నరేశ్ అరెస్ట్ చేశారు. వారి నుంచి 33 వేల నగదు, 4 చరవాణులు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు.