ద్విచక్ర వాహనం అమ్ముతానంటూ ఓ సైబర్ నేరగాడు ఫేస్బుక్లో ప్రకటనిచ్చాడు. సికింద్రాబాద్‌కు చెందిన విజయత్ర మోహన్ ఆ ప్రకటన చూసి... అందులోని ఫోన్ నంబర్‌ను సంప్రదించాడు. ఆవతలి వ్యక్తి తన పేరు మనీష్ సింగ్ అని బదులిచ్చాడు.
ఆశ కల్పించి.. అందినంత దోచేశాడు
భాగ్యనగరంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తోంటే...మరోవైపు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆశ చూపించి అందినంత దోచేసుకుంటున్నారు.
Hyderabad cyber crime latest news
బండినచ్చితే ట్రాన్స్పోర్ట్ కోసం 2500 రూపాయలు ఇవ్వాలన్నాడు. మోహన్ వెంటనే ఆ డబ్బును పంపించాడు. అలా ఒక లక్ష 16వేల రూపాయలు ఇచ్చాడు. చివరకు మోసం గ్రహించి బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.