అబిడ్స్‌లోని జగదీశ్ మార్కెట్లో చరవాణి మరమ్మతులు చేసే అశోక్ పాటిల్ అనే యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది మార్చిలో ఓ యువతి తన ఫోన్ రిపేర్ కోసం అశోక్ దుకాణానికి వెళ్లింది. రిపేర్ చేయడానికి రెండు రోజుల సమయం పడుతుందని చెప్పి చరవాణిని తన వద్దే ఉంచుకున్నాడు.
ఫోన్ రిపేర్ కోసం వెళితే.. ఏం చేశాడో తెలుసా? - నకిలీ ఫేస్బుక్ మోసం
చరవాణి మరమ్మతులు చేసే వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ రిపేర్‌కు వెళ్లిన ఓ యువతి ఫోటోలను ఫేస్బుక్ నుంచి దొంగిలించి.. నకిలీ ఖాతా తెరిచాడు. ఆలస్యంగా తెలుసుకున్న యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫోన్ రిపేర్ కోసం వెళితే.. ఏం చేశాడో తెలుసా?
మరమ్మతు చేశాక యువతి ఫేస్‌బుక్‌లోని ఫోటోలన్నింటిని తన లాప్‌టాప్‌లోకి కాపీ చేసుకున్నాడు. అనంతరం సదరు యువతి పేరు మీద నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న యువతి.. రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి: పీఆర్సీ నివేదికపై ఆందోళన వద్దు: మంత్రి శ్రీనివాసగౌడ్
Last Updated : Jan 28, 2021, 10:46 PM IST