తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'గొడ్డలితో నరికాడు.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు' - murder in tandoor

వివాహేతర సంబంధం ఓ యువకుని ప్రాణం తీసింది. తన భార్యతో వివాహేతర సంబంధం సాగిస్తున్న వ్యక్తిని ఓ భర్త దారుణంగా హత్య చేసి స్వయంగా పోలీసులకు సమాచారం అందించిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో చోటు చేసుకుంది.

extra marital affair leads to murder at tandoor
తాండూరులో యువకుని దారుణ హత్య

By

Published : Oct 24, 2020, 11:30 AM IST

వికారాబాద్​ జిల్లా తాండూరు మండలంలో హత్య కలకలం రేపింది. రాంపూర్​ గ్రామానికి చెందిన సతీశ్ (32) అనే యువకుణ్ని అదే గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసులకు స్వయంగా తానే సమాచారం అందించాడు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రామచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రామచంద్రారెడ్డి భార్యతో సతీశ్​ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, శుక్రవారం నాడు అతని ఇంటికి వచ్చిన సతీశ్​ను.. ఊరు బయటకు తీసుకువెళ్లి రామచంద్రారెడ్డి హత్య చేసినట్లు సీఐ జలందర్​ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details