మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని జీఆర్ రెడ్డి నగర్ లోని మద్యం దుకాణం పక్కన ఉన్న సెక్యురిటీ గదిలో అర్థరాత్రి వంట గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఇంటి పై కప్పు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రంజన్ (35) కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పై వెళుతోన్న వాహనదారులు గమనించి మంటలను ఆర్పివేశారు. సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాతో పడి ఉన్న రంజన్ ను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరికి తీవ్రగాయాలు - మేడ్చల్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలుడు
మద్యం దుకాణం పక్కన ఉన్న సెక్యురిటి గదిలో అర్థరాత్రి వంట గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని జీఆర్ రెడ్డి నగర్లో జరిగింది.
పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరికి తీవ్రగాయాలు
ఇదీ చూడండి: నటుడు సోనూసూద్‌కు ఆలయం... అభిమానుల పూజలు