కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలం సలబాత్పూర్ వద్ద నల్లబెల్లాన్ని ఎక్సైజ్ శాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి తెలంగాణలోని మహబూబ్ నగర్‌కు తరలిస్తున్న బెల్లాన్ని అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద సీజ్ చేసినట్ల ఎక్సైజ్ సీఐ లక్ష్మీ వెల్లడించారు.
సలబాత్పూర్ వద్ద నల్లబెల్లం పట్టివేత - కామారెడ్డి నేర వార్తలు
కామారెడ్డి జిల్లాలోని సలబాత్పూర్ వద్ద నల్లబెల్లాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాందేడ్ నుంచి మహబూబ్‌నగర్‌కు దీనిని తరలిస్తున్నట్లు వెల్లడించారు. లారీలో తరలిస్తున్న 333 నల్లబెల్లం బస్తాలను సీజ్ చేశారు.
సలబాత్పూర్ వద్ద నల్లబెల్లం పట్టివేత
లారీలో తరలిస్తున్న 333 బస్తాల నల్లబెల్లం పట్టుబడినట్లు ఆమె పేర్కొన్నారు. సుమారుగా 9.9 క్వింటాళ్ల వరకు ఉంటుందని... దాని విలువ రూ.3.50 లక్షలు ఉండవచ్చని సీఐ అంచనా వేశారు. నిందితులను బిచ్కుంద స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్సైలు నాగరాజు, జనార్దన్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:దారుణం: భర్తపై అనుమానంతో భార్య యాసిడ్ దాడి