కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండల శివారులో బెల్లం తరలిస్తున్న వాహనాన్ని ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. 22 క్వింటాళ్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనాన్ని సీజ్ చేసి ఒకరిపై కేసు నమోదు చేశారు.
వాగ్వాదం..
ఈ క్రమంలో ఆబ్కారీ కార్యాలయం వద్ద అధికారులకు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం నెలకొంది. తాము న్యాయ బద్దంగా వ్యాపారం నిర్వహిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని సదరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయం వద్ద వివాదం నెలకొనడం వల్ల పోలీసులు జోక్యం చేసుకుని వ్యాపారులకు పంపించేశారు.