మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని నేరెడ్మెట్ క్రాస్‌రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మల్కాజ్‌గిరిలో 100 కేజీల గంజాయి పట్టివేత - గంజాయి పట్టివేత
మల్కాజ్గిరిర ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.10 లక్షలు విలువ చేసే.. 100 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
మల్కాజ్‌గిరిలో 100 కేజీల గంజాయి పట్టివేత
తూర్పు గోదావరి నుంచి అక్రమంగా తరలిస్తున్న వంద కేజీల గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న సమాచారం అందుకొని దాడులు చేసినట్టు ఎక్సైజ్ డీసీపీ ఎస్‌వై ఖురేషి తెలిపారు. గంజాయి విలువ దాదాపు రూ.10 లక్షలు విలువ చేస్తుందని.. అక్రమ వ్యాపారాలు చేస్తే.. ఎంతటి వారైనా సహించేది లేదని పోలీసులు తెలిపారు.