వరంగల్ గ్రామీణ జిల్లాలో నాటు సారా ఏరులై పారుతోంది. అధికారులు వరుస దాడులు చేసినా గుడుంబా మాఫియా యథేచ్ఛగా స్థావరాలు ఏర్పరుచుకుని నాటుసారా సరఫరా చేస్తోంది. వర్ధన్నపేట మండలంలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 827 లీటర్ల అక్రమ మద్యం పట్టుబడింది.
ఎక్సైజ్ దాడులు... 827 లీటర్ల అక్రమ మద్యం ధ్వంసం - వర్ధన్నపేటలో ఎక్సైజ్ దాడులు
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలోని గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. 827 లీటర్ల అక్రమ మద్యం ధ్వంసం చేశారు. 2,500 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
excise officers raids in vardhannapet
మద్యం సీసాలను ధ్వంసం చేసిన అధికారులు... కేసు నమోదు చేశారు. ఇల్లంద గ్రామ శివారులో 2,500 కిలోల నల్లబెల్లం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం, గుడుంబా స్థావరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.