ములుగు జిల్లా జంగాలపల్లి, రాంనగర్ తండా అటవీ ప్రాంతంలో నాటు సారా కాస్తున్న స్థావరాలపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి నిర్వహించారు. అటవీ ప్రాంతంలో నీరు ప్రవహిస్తున్న ఒర్రెలను ఆసరాగా చేసుకుని ఎన్నో రోజులుగా సారాయి కాస్తూ దందా నడుపుతున్నారు.
అడవిలో నాటుసారా స్థావరం.. అధికారుల ధ్వంసం - ములుగు జిల్లా గుడుంబా స్థావరాల వార్తలు
ములుగు జిల్లా జంగాలపల్లి రాంనగర్ తండా అటవీ ప్రాంతంలో నాటు సారా కాస్తున్న స్థావరాలపై దాడి చేసి ఎక్సైజ్ శాఖ అధికారులు 24 ప్లాస్టిక్ డ్రమ్ములు, రెండు వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు
సారాయి గురించి సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కాలినడకన అటవీ ప్రాంతాలకు వెళ్లి దాడి చేశారు. 24 ప్లాస్టిక్ డ్రమ్ములు, రెండు వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
ఇదీ చదవండిఃకూరగాయల మార్కెట్ షెడ్డులో అగ్నిప్రమాదం