నకిలీ చలాన్లతో ఎక్సైజ్ అధికారులను బురిడీ కొట్టించిన ఘటనలో మద్యం దుకాణదారులపై వరంగల్ గ్రామీణ జిల్లా అబ్కారీ శాఖ.. విచారణ ముమ్మరం చేసింది. దుకాణం రెన్యువల్ కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 68లక్షల 70వేలు చెల్లించినట్లు నకిలీ చలాన్లు సృష్టించి అధికారులను మోసం చేశారు. గుర్తించిన అబ్కారీ శాఖ.. 9మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
నకిలీ చలాన్ల కేసులో అబ్కారీ శాఖ విచారణ
వరంగల్ గ్రామీణ జిల్లాలో మద్యం దుకాణం రెన్యువల్ డబ్బు కట్టినట్లుగా ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించిన వారిపై ఎక్సైజ్ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. దాదాపు రూ. 69 లక్షలు కట్టినట్లుగా నిందితులు నకిలీ చలాన్లు సృష్టించారు.
వరంగల్ గ్రామీణ జిల్లా, నకిలీ పత్రాలు, ఎక్సైజ్ శాఖ, వైన్ షాప్ నకిలీ పత్రాలు
ప్రభుత్వాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించిన వారిపై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:బాలికపై లైంగికి దాడికి యత్నం.. నిందితునికి ఐదేళ్ల జైలు