తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గుండె పోటుతో మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి మృతి - ఏపీ వార్తలు

ఏపీలోని కడప మాజీ ఎమెల్యే కందుల శివానందరెడ్డి తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుముూశారు. ఈయన మృతిపట్ల పలువురు నాయకులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు సంతాపం తెలిపారు.

former mla died due to heart attack
గుండె పోటుతో మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి మృతి

By

Published : Nov 4, 2020, 4:09 PM IST


ఏపీలోని కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. 1981లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా, 1989 నుంచి 1994 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగారు. కడప జిల్లా తెదేపా అధ్యక్షుడిగా పని చేశారు. కడప, రాయలసీమ పేరిట స్పిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు. కందుల గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు.

కడపలో కందుల కుటుంబానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. కొంతకాలం నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కందుల శివానందరెడ్డి సోదరుడు కందుల రాజమోహన్​రెడ్డి భాజపాలో రాష్ట్రస్థాయి నాయకత్వంలో పని చేస్తున్నారు. శివానందరెడ్డి మృతి పట్ల పలువురు నాయకులు, విద్యావేత్తలు సంతాపం తెలిపారు.

ఇవీ చదవండి:మస్తాన్ వలీ కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details