తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు - మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు

06:58 June 13
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు
తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడి అస్మిత్ రెడ్డిని కూడా శంషాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. వీరు బీఎస్ -3 వాహనాలను బీఎస్ -4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేశారని ఆర్టీఏ అధికారులు ఆరోపిస్తున్నారు.
నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారని... 154 లారీలకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని.... కొంతకాలంగా ఆర్టీఏ అధికారులు ఆరోపించారు. జేసీ కుటుంబసభ్యులపై అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో 12 కేసులు నమోదయ్యాయి. తాడిపత్రిలో 17.... కర్నూలు జిల్లాలో 3 కేసులు ఉన్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలతో అనంతపురంలో 51 లారీలను గతంలో పోలీసులు సీజ్ చేశారు.