అచ్చెన్నాయుడిని మూడు రోజులపాటు అనిశా కస్టడీకి అనిశా ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. ఆస్పత్రిలోనే విచారించాలని ఆదేశించింది. అచ్చెన్నాయుడితో పాటు ఇదే కేసులో ఎ1గా ఉన్న రమేష్ కుమార్నూ అధికారులు విచారించనున్నారు.
మూడు రోజుల అనిశా కస్టడీకి అచ్చెన్నాయుడు
ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అనిశా కస్టడీకి అనిశా ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. మూడు రోజులపాటు ఆస్పత్రిలోనే విచారించాలని ఆదేశించింది. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ అవకవతకల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
atchannaidu
ఈఎస్ఐ అవకవతకల కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. విచారణ చేపట్టిన అనిశా న్యాయస్థానం.. అచ్చెన్నకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఆయనకున్న అనారోగ్యం దృష్ట్యా పోలీసుల పర్యవేక్షణలో ఆసుపత్రిలో చికిత్స అందించాలని తెలిపింది. ఈ మేరకు గుంటూరు జీజీహెచ్లో మాజీ మంత్రి చికిత్స పొందుతున్నారు.