మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య కన్నుమూశారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమె మరణించారు. నాయిని నర్సింహారెడ్డి ఈ నెల 22న మరణించగా.. ఆయన మరణించిన వారంలోపే ఆమె ప్రాణాలు కోల్పోయారు.
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి కన్నుమూత - నాయిని సతీమణి అహల్య మృతిపట్ల సభాపతి పోచారం సంతాపం
![మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి కన్నుమూత ex home minister and late nayini narsimha reddy wife dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9321096-thumbnail-3x2-wife.jpg)
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి కన్నుమూత
20:13 October 26
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి కన్నుమూత
నాయిని సతీమణి అహల్య మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, సభాపతి పోచారం, మంత్రులు ఈటల, తలసాని, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, అజయ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్ సంతాపం తెలిపారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఐదు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ మరణించడం విషాధకరమని పేర్కొన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Last Updated : Oct 26, 2020, 10:53 PM IST