ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం ఇమామ్‌నగర్ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 60 కిలోల గంజాయిని... ఖమ్మం టాస్క్‌ఫోర్స్, ఏన్కూరు పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. తండాకు చెందిన సురేష్ అనే వ్యక్తి ఓ పాత ఇంట్లో గంజాయిని నిల్వ ఉంచి... ద్విచక్రవాహనంపై తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
ఏన్కూరులో 60 కిలోల గంజాయి పట్టివేత - 60 కిలోల గంజాయి పట్టుకున్న ఏన్కూరు పోలీసులు
ద్విచక్రవాహనంపై గంజాయి తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నిందితునికి సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. రూ.5 లక్షల విలువైన సుమారు 60 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
ఏన్కూరులో 60 కిలోల గంజాయి పట్టివేత
డొంకరాయి నుంచి గంజాయి ఇక్కడకు తరలించి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. దీని విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. సురేష్‌కు సహకరించిన ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంకట్రావ్, సీఐలు కరుణాకర్, వెంకటస్వామి, సతీష్ కుమార్, ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి:నాచారం చోరీ కేసులో వెలుగులోకి కీలక విషయాలు