తల్లిదండ్రులపై మనస్తాపం చెంది ఉరేసుకుని ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామంలో పెనువిషాదం నింపింది. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న రాజ్‌కుమార్ అనే యువకుడు కరోనా వల్ల ఇంట్లోనే ఉంటున్నారు.
తల్లిదండ్రులపై మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య - వరంగల్ గ్రామీణ జిల్లా వార్తలు
వరంగల్ గ్రామీణ జిల్లా ఇల్లందులో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులపై మనస్తాపం, అనారోగ్య సమస్యలతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు అభిప్రాయపడ్డారు.
తల్లిదండ్రులపై మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
ఏమైందో కానీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులపై మనస్తాపం.. అనారోగ్య సమస్యలతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు అభిప్రాయపడ్డారు. చేతికి అందొచ్చిన కుమారుడు మృతిచెందగా ఇల్లందులో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీచూడండి:ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి..