బ్యాంకు మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎట్టకేలకు అరెస్టు చేసింది. జయ్ అంబే గౌరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ నరేందర్ కుమార్ పటేల్‌ను అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈడీ అదుపులోకి తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సుమారు రూ.65 కోట్ల రుణం తీసుకొని ఎగవేసినట్లు నరేందర్ కుమార్ పటేల్, తదితరులపై 2018లో సీబీఐ బెంగళూరు విభాగం కేసు నమోదు చేసింది.
రూ.65కోట్ల రుణం తీసుకొని విదేశాలకు పారిపోయిన నిందితుడి అరెస్ట్ - బ్యాంకు రుణం వార్తలు
బ్యాంకు మోసానికి పాల్పడిన జయ్ అంబే గౌరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ నరేందర్ కుమార్ పటేల్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. భారత్ నుంచి 2015లో పారిపోయిన నరేందర్ కుమార్ పటేల్ కోసం సీబీఐ, ఈడీ ఆరేళ్లుగా గాలిస్తున్నాయి. ఇవాళ దేశానికి తిరిగి వస్తున్నట్లు పసిగట్టిన ఈడీ అధికారులు అహ్మదాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు.
ed
సీబీఐ కేసు ఆధారంగా ఈడీ హైదరాబాద్ విభాగం మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేస్తోంది. భారత్ నుంచి 2015లో పారిపోయిన నరేందర్ కుమార్ పటేల్ కోసం సీబీఐ, ఈడీ ఆరేళ్లుగా గాలిస్తున్నాయి. ఇవాళ దేశానికి తిరిగి వస్తున్నట్లు పసిగట్టిన ఈడీ అధికారులు అహ్మదాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు.
ఇదీ చదవండి :'వ్యాక్సినేషన్ విజయవంతం... సీఎం కృషి అభినందనీయం'