సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేశారని.. ప్రశ్నిస్తే.. తిరిగి తమపైనే దాడిచేశారంటూ కొంతమంది విద్యార్థులు విశాఖ పోలీసులను ఆశ్రయించారు.
ఏం చేేశారు..
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేశారని.. ప్రశ్నిస్తే.. తిరిగి తమపైనే దాడిచేశారంటూ కొంతమంది విద్యార్థులు విశాఖ పోలీసులను ఆశ్రయించారు.
ఏం చేేశారు..
ఎన్ఏడి కూడలి కాకానినగర్ వద్ద యూఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటన చేసింది. అది చూసి ఉద్యోగం కోసం వెళ్లిన ఒక్కొక్కరికి చేత రూ.2,500 చొప్పున కట్టించుకున్నారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగలివ్వలేదు.
తాము కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఓ యువతి.. ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లి అడిగినట్టు చెప్పింది. వారు తనను గదిలో బంధించి.. దాడి చేసి.. గాయపరిచినట్టు ఎయిర్పోర్ట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన లాగే వందలాది విద్యార్థులు డబ్బులు కట్టి మోసపోయారని తెలిపింది. న్యాయం చేయాలని కోరుతూ.. కొంతమంది బాధితులు పోలీసులను కోరారు. ఇదే సంస్థపై గతంలోనూ ఫిర్యాదులు అందాయని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇవీచూడండి:సీరియల్ కిల్లర్: మహిళలే లక్ష్యం... 16 దారుణ హత్యలు!