వనపర్తి జిల్లా పానగల్ మండలం మంగళపల్లిలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పొలంలో పంటకు నీరు పెట్టడానికి వెళ్లిన రైతు మరాఠీ వెంకటయ్య (48) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. పొలానికి నీళ్లు పెడుతుంటే ప్రమాదవశాత్తు విద్యుత్తు వైర్లు తగిలి మరణించాడు. చేనుకు వెళ్లిన వెంకటయ్య ఇంటికి రాకపోవడం వల్ల ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి చూసేసరికే చనిపోయి ఉన్నాడు. అతన్ని చూసిన వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పండుగ పూట విషాదం.. విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి
పండుగ ఆ రైతు కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కరెంట్షాక్తో ఓ అన్నదాత మృతి చెందడం వల్ల వనపర్తి జిల్లా మంగళపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పండుగ పూట విషాదం.. విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి
రైతు వెంకటయ్యకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. కౌలుకి పొలాన్ని తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని గ్రామస్థులు తెలిపారు. ప్రభుత్యం వెంకటయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కోరారు. పండుగ పూట రైతు విద్యుత్తు షాక్తో మృతి చెందడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.