తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇంట్లో విద్యుదాఘాతం... మంటల్లో సామగ్రి దగ్ధం - అగ్ని ప్రమాదంలో సామాగ్రి దగ్ధం

విద్యుదాఘాతం ఓ ఇంటిని బూడిదపాలు చేసింది. ఇంట్లో వస్తువులన్నీ మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు గొల్లబస్తీలో ఘటన చోటుచేసుకుంది.

electric-shock-in-the-house-total-equipment-burned-in-fire-accident
ఇంట్లో విద్యుదాఘాతం... మంటల్లో సామగ్రి దగ్ధం

By

Published : Dec 24, 2020, 3:15 PM IST

విద్యుదాఘాతానికి గురైన ఓ ఇల్లు మంటల్లో చిక్కుకుంది. పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో ఇంట్లో సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు గొల్లబస్తీలో పాండుయాదవ్​ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది.

ఇంట్లో విద్యుదాఘాతం... మంటల్లో సామగ్రి దగ్ధం

స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అక్కడ పరిసరాలన్నీ పెద్దఎత్తున పొగ నిండుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యుత్​ మీటర్​లో నిప్పులు చెలరేగి ప్రమాదం సంభవించిందని బాధితురాలు వాపోయారు.

ఇదీ చూడండి:ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

ABOUT THE AUTHOR

...view details