మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల వల్ల ట్రాక్టర్‌పై తరలిస్తున్న వరిగడ్డి దగ్ధమైంది. గ్రామానికి చెందిన చంద్రయ్య అనే రైతు వ్యవసాయ భూమి నుంచి ట్రాక్టర్ ద్వారా 70 కట్టల వరిగడ్డిని తరలిస్తున్నారు.
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం.. కళ్లముందే దగ్ధమైన వరిగడ్డి - విద్యుదాఘాతంతో దగ్ధమైన గడ్డి
మహబూబాబాద్ జిల్లా కుమ్మరికుంట్ల వద్ద విద్యుత్ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్లో తరలిస్తున్న వరిగడ్డి ప్రమాదవశాత్తు కరెంటు తీగలకు తగిలి దగ్ధమైంది.

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం.. దగ్ధమైన 70 వరిగడ్డి కట్టలు
అయితే ఎస్సీకాలనీ వద్ద గడ్డి ట్రాక్టర్‌కు ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగలడం వల్ల ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు కేకలు వేయడం వల్ల అప్రమత్తమైన డ్రైవర్ ట్రాలీని పైకెత్తి మండుతున్న గడ్డిని కిందకు పడేశారు. కాగా సుమారు రూ.10 వేల నష్టం వాటిల్లిందని బాధితరైతు అంటున్నారు.
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం.. దగ్ధమైన 70 వరిగడ్డి కట్టలు
ఇదీ చూడండి:ధాన్యం ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు.. రైతుల ఆందోళన..
Last Updated : Nov 8, 2020, 7:54 PM IST