నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లి గ్రామ శివారులో విషాదం చోటుచేసుకుంది. నారుమడికి పందుల నుంచి రక్షణగా కట్టిన విద్యుత్ కంచె ఇద్దరి పాలిట శాపంగా మారింది. పందులను వేటాడడానికి వెళ్లిన ఇద్దరు కంచె తగిలి అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇద్దరు మృతి: రక్షణ కోసం కంచె కడితే భక్షించింది - Electric fence turned into a curse in Dupalli
నారుమడికి పందుల నుంచి రక్షణగా కట్టిన విద్యుత్ కంచె తగిలి ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా దూపల్లిలో చోటుచేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
![ఇద్దరు మృతి: రక్షణ కోసం కంచె కడితే భక్షించింది శాపంగా మారిన విద్యుత్ కంచె... ఇద్దరు వ్యక్తులు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9790515-44-9790515-1607318901343.jpg)
శాపంగా మారిన విద్యుత్ కంచె... ఇద్దరు వ్యక్తులు మృతి
ఉదయం పంట పొలాలకు వెళ్లిన గ్రామస్థులు ఇద్దరు అక్కడ శవాలుగా పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. వారి వివరాలు ఎవరికైనా తెలిస్తే తమకు సమాచారం అందించాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు పోలీసులు తెలిపారు.