మద్యం మత్తులో సొంత తమ్ముడిని అన్న హతమార్చిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం గోవిందుతండాలో చోటుచేసుకుంది. గోవిందుతండాకు చెందిన ధీరావతు శ్రీనునాయక్(30) గురువారం రాత్రి తన ఇంట్లో భోజనం చేస్తుండగా అతని అన్న ధీరావతు చందర్ మద్యం తాగి వచ్చి కర్రతో తలపై కొట్టాడు.
మద్యం మత్తులో తమ్ముడిని కడతేర్చిన అన్న - గోవిందుతండాలో తమ్ముడిని చంపిన అన్న
మద్యం మత్తు హత్యకు దారితీసింది. తాగిన మైకంలో సొంత తమ్మున్నే చంపేశాడో అన్న. ఇంట్లో భోజనం చేస్తున్న సోదరున్ని కర్రతో తలపై కొట్టాడు.. తీవ్ర గాయాలైన అతన్ని చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని గోవిందుతండాలో చోటుచేసుకుంది.
మద్యం మత్తులో తమ్ముడిని కడతేర్చిన అన్న
తీవ్ర గాయాలపాలైన శ్రీనునాయక్‌ను చికిత్స కోసం తుర్కపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు. మృతునికి భార్య కవిత, కొడుకు, కూతురు ఉన్నారు. భువనగిరి రూరల్ సీఐ జానయ్య సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై యాదగిరి తెలిపారు.