తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నీటి గుంతలో పడి ఎనిమిదేళ్ల బాలుడి మృతి

పతంగి ఎగురవేస్తూ... చెరువులో పడి బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ మియాపూర్​లో చోటుచేసుకుంది. చెరువు సుందరీకరణ కోసం చేపట్టిన పనులు అర్ధాంతరంగా నిలిపివేయడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

boy death
నీటి గుంతలో పడి ఎనిమిదేళ్ల బాలుడి మృతి

By

Published : Jan 12, 2021, 5:52 AM IST

హైదరాబాద్ మియాపూర్​లోని పటేల్ చెరువులో పడి 8ఏళ్ల బాలుడు మృతి చెందాడు. పతంగి ఎగురవేసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రెండు సంవత్సరాల క్రితమే భర్తను, ఇప్పుడు కుమారుడి పోగొట్టుకున్న బాలుడి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది.

చెరువు సుందరీకరణలో భాగంగా రెండేళ్ల క్రితం చెరువులో పనులు ప్రారంభించారు. ఏడాదిన్నర కాలంగా అర్ధాతంరంగా నిలిపివేశారు. ఇప్పుడు ఆ గుంతలోనే బాలుడు పడి చనిపోవడం... గుత్తేదారుల సమన్వయ లోపమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమయానికి పనులు పూర్తి చేసి ఉంటే బాలుడు దూరమయ్యేవాడు కాదని ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి:పొలం దున్నతుండగా ట్రాక్టర్ పల్టీ... డ్రైవర్ మృతి!

ABOUT THE AUTHOR

...view details