తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వైద్యం వికటించి ఎనిమిదేళ్ల బాలుడు మృతి - టప్పాఛబుత్రలో ఎనిమిదేళ్ల మృతి

వైద్యుడు ఇచ్చిన ఇంజిక్షన్​తోనే తమ కుమారుడు చనిపోయాడని ఆరోపిస్తూ... బాలుడి తల్లిదండ్రులు హైదరాబాద్ టప్పాచాబుత్ర పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

వైద్యం వికటించి ఎనిమిదేళ్ల బాలుడు మృతి
వైద్యం వికటించి ఎనిమిదేళ్ల బాలుడు మృతి

By

Published : Oct 24, 2020, 12:28 PM IST

హైదరాబాద్ టప్పాచాబుత్రలో శశికిరణ్ అనే ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జ్వరంతో బాధపడుతున్న బాలుడిని తండ్రి స్థానికంగా ఉన్న ఓ ప్రైవైటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యుడు ఇంజిక్షన్ ఇచ్చి పంపాడు.

ఇంటికి వచ్చాక కూడా బాలుడు మేలుకోలేదు. మృతి చెందాడని గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇంజిక్షన్​ వల్లనే చనిపోయాడని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:'గొడ్డలితో నరికాడు.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు'

ABOUT THE AUTHOR

...view details