జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం అరపేట సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా గోపన్పల్లి వాసులు ఆటోలో.. ధర్మపురి నర్సింహస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. అరపేట శివాలయం మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీకొట్టారు.
ధర్మపురి దర్శనానికి వెళ్లొస్తుండగా ప్రమాదం.. 8 మందికి గాయాలు - eight people injured when an auto hits a tree at metpally
జగిత్యాల జిల్లా ధర్మపురి నర్సింహస్వామి దర్శనానికి వెళ్లి తిరిగివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవరుడు సహా ఏడుగురు గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మెట్పల్లిలో దైవ దర్శనం నుంచి వెళ్తుండగా ప్రమాదం
ఈ ప్రమాదంలో ఆటోలో ముందు కూర్చున్న నవ వరుడు క్యాబిన్లో ఇరుక్కుపోగా.. స్థానికులు అతణ్ని బయటకు తీశారు. డ్రైవర్ సహా గాయపడిన ఎనిమిది మందిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.