తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బండిపై వచ్చారు... రూ.8.5 లక్షలు దోచేశారు - robbery at meerpet in hyderabad

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని ముగ్గురు దుండగులు అడ్డగించారు. అతని వద్ద ఉన్న నగదు లాక్కొని పరారయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్​ మీర్​పేట్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

eight lakh rupees robbery at meerpet in hyderabad
బండిపై వచ్చారు... రూ.8.5 లక్షల దుడ్డు దోచేశారు

By

Published : May 26, 2020, 8:39 AM IST

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన అచ్చిరెడ్డి ప్లాస్టిక్​ ప్లేట్​ కంపెనీలో కలెక్షన్​ బాయ్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల నుంచి రూ.8.5 లక్షల నగదు వసూలు చేసి తన కంపెనీకి తిరిగి వెళ్తున్నాడు. అటుగా ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు అచ్చిరెడ్డి వద్ద ఉన్న నగదు సంచిని లాక్కొని పరారయ్యారు.

తన వద్ద నుంచి రూ.8.5 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారని బాధితుడు మీర్​పేట్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. బాధితుణ్ని ముందు నుంచే ఫాలో అయ్యి నగదు దోచేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details