ఆన్లైన్ జూదం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నైసర్ కొఠారి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నైసర్ కొఠారి క్రిప్టో కరెన్సీ విధానంలో నగదును హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. నిషేధిత ఆన్లైన్ జూదం నిర్వహిస్తున్న లింక్యున్ టెక్నాలజీ, డాకీ పే ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మరికొన్ని కంపెనీలపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలను హవాలా మార్గం ద్వారా చైనాకు తరలించినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఆన్లైన్ జూదం కేసులో కీలక నిందితుడు అరెస్ట్ - online betting case news
ఆన్లైన్ జూదం కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయగా... మరో కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ జూదం, క్రిప్టో కరెన్సీ లాంటి నిషేదిత వ్యాపారాలను నడుపుతున్న నైసర్ కొఠారి అనే వ్యక్తికి అరెస్టు చేశారు. ఈడీ అధికారులు కస్టడీ కోరగా.. 13 నుంచి 22 వరకు న్యాయస్థానం అనుమతించింది.
ఈ కేసులో ఇప్పటికే దిల్లీకి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులపై ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హెచ్ఎస్బీసీ బ్యాంకు, పేటీఎం, క్యాష్ ఫ్రీ రోజీ పే ద్వారా నగదును చైనాకు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. ఇందులో క్రిప్టో కరెన్సీ వ్యాపారం నిర్వహిస్తున్న నైసర్ కొఠారి హస్తం ఉన్నట్లు వెల్లడైంది. భావ్‌నగర్‌లో క్రిప్టో కరెన్సీ వ్యాపారం నిర్వహిస్తున్న నైసర్.. ఆన్లైన్ జూదం నిర్వాహకుల నుంచి నగదు స్వీకరించి దానిని విదేశాలకు తరలించినట్లు తెలిసింది. నైసర్ కొఠారిని న్యాయస్థానంలో హాజరు పరచిన ఈడీ కస్టడీకి కోరగా... 13 నుంచి 22 వరకు న్యాయస్థానం అనుమతించింది.