తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దుర్గగుడి వెండి సింహాల మాయంపై కీలక ఆధారాలు

దుర్గగుడిలో వెండి రథంపై ఉండే మూడు సింహాలను లాక్ డౌన్ సమయంలోనే చోరీ చేసినట్టు ఆధారాలు లభిస్తున్నాయి. ఆలయంలో పని చేసే సిబ్బందితో పాటు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఆలయ నిర్మాణ పనుల్లో పాల్గొన్న ఉత్తరాది కార్మికులతో పాటు వెండి సింహాలను మెరుగు పెట్టించే కాంట్రాక్టు అందుకున్నవారిపైనా పోలీసులు దృష్టి సారించారు.

By

Published : Sep 19, 2020, 1:14 PM IST

durga temple simhalu chroi case in vijayawada
దుర్గగుడి వెండి సింహాల మాయంపై కీలక ఆధారాలు

ఆంధ్రప్రదేశ్​ ఇంద్రకీలాద్రి అమ్మవారి రథం సింహాలు మాయమైన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు . ఇంద్రకీలాద్రిపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులు రెండేళ్లుగా సాగుతున్నాయి. ఈ నిర్మాణ పనుల కోసం బిహార్​తో పాటు.. ఇతర ప్రాంతాల నుంచి కార్మికులు వచ్చారు. వారందరికీ ఆలయ ప్రాంగణంలోనే బస ఏర్పాటు చేశారు .లాక్ డౌన్ లోనూ ఆలయ పనులు చేపట్టారు. 15 రోజుల క్రితమే పనులు పూర్తి చేసుకుని కార్మికులు వారి సొంత ప్రాంతాలకు వెళ్లారు . వారు ఉన్నంత కాలం ఆలయ ప్రాంగణంలో అన్నిచోట్లకూ వెళ్లేవారు. పోలీసులు ప్రస్తుతం వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టి విచారణ సాగిస్తున్నారు.

ఈ కేసులో ఇంటి దొంగల హస్తం ఏమైనా ఉందా ? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు . ఆలయంలో గతంలో జరిగిన కొన్ని చిన్న దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్న కిందిస్థాయి సిబ్బందిని కూడా విచారిస్తున్నారు . రాష్ట్రంలో ఈ తరహా లో దొంగతనాలు చేసే ముఠాలు, అనుమానితుల జాబితాను పరిశీలిస్తున్నారు. గత ఏడాది ఉగాదికి శ్రీగంగాపార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఈ రథం పై ఊరేగించారు . అప్పుడు రథం పై సింహం విగ్రహలు ఉన్నాయి . ఈ ఏడాది ఉగాదికి కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో అమ్మవారిని వెండి రథంపై ఊరేగించలేదు. ఉత్సవాలకు ముందు ఈ రథాన్ని ఆలయ సిబ్బంది పరిశీలించినట్టు పోలీసు విచారణలో తేలింది.

వెండి సింహాల చోరీ విషయంపై దుర్గగుడి అధికారులు మూడు రోజులు ఆగి ఫిర్యాదు చేయడంతో కావాలనే ఆధారాలను ఎవరైనా తారుమారు చేసేందుకు ప్రయత్నించారా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. అమ్మవారి గుడిలో సీసీ కెమెరా ఫుటేజీ కూడా 15 రోజులకు మించి ఉంచకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఏడాది మార్చి 25 ఉగాదికి ముందు రథానికి మెరుగు పెట్టేందుకు దుర్గ గుడి అధికారులు శ్రీ శార్వాణి ఇండస్ట్రీస్ సంస్థతో 47 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది . ఈ పనిని సదరు సంస్థ మరో గుత్తేదారు వెంకట్ కు అప్పగించింది. ఉగాదికి 15 రోజుల ముందు వెంకట్ తన సిబ్బందితో కలిసి రథాన్ని చూసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దేవస్థానానికి చెందిన అప్రెజర్ షమీ , అసిస్టెంట్ స్తపతి షణ్ముకం , ఏఈవోలు ఎన్.రమేష్ , తిరుమలరావును విచారించారు. ఈ కేసులో కాంట్రాక్టర్ వెంకట్ స్టేట్ మెంట్ కీలకం కానుండటంతో అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

ఇదీ చూడండి :యాదాద్రి ఆలయంలో ఆకట్టుకుంటున్న నిర్మాణ పనులు

ABOUT THE AUTHOR

...view details