ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఖాజీపేట మండలం మునిపాకలో భూ తగాదా ఒకరిని బలితీసుకుంది. బావ బావమరదుల మధ్య జరిగిన సంఘటనతో బావమరది షేక్ గౌస్‌పీర్ (55) మృతి చెందారు. గత ఆరేళ్లుగా గౌస్‌పీర్‌కు.. బావ నాయబ్ రసూల్‌కు మధ్య వివాదం నెలకొంది. ఆదివారం పొలం వద్ద గౌస్‌పీర్ కంపచెట్లు తొలగించే పనులు చేసుకుంటూ ఉండగా నాయబ్ రసూల్‌తోపాటు అతని అనుచరులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కత్తిపోటుకు గురైన గౌస్‌పీర్‌ను చికిత్స కోసం కడపకు ఆటోలో తరలిస్తూ ఉండగా మృతి చెందారు. ఖాజీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆరేళ్ల పగ: బావమరిదిని చంపిన బావ
ఆరేళ్లుగా బావ బావమరుదుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మరోసారి ఓ విషయంపై ఘర్షణ పడ్డారు. బావ చేతిలో బావమరిది బలయ్యాడు. అసలేం జరిగింది!
ఆరేళ్ల పగ: బావమరిదిని చంపిన బావ