తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విద్యుత్ ప్రమాదాలకు ఆ జిల్లా పరాకాష్ట... కరెంట్​ షాక్​తో రైతు మృతి - current shock latest News

నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఎక్కడో ఓ చోట ప్రతి రోజూ విద్యుదాఘతానికి ప్రాణాలు పోతూనే ఉన్నాయి. అయినా ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ శాఖ అధికారులకు ప్రజల ప్రాణాలు అంటే లెక్కే లేదు. ఫలితంగా విద్యుదాఘాతంతో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

విద్యుత్ ప్రమాదాలకు ఆ జిల్లా పరాకాష్ట... కరెంట్​ షాక్​తో రైతు మృతి
విద్యుత్ ప్రమాదాలకు ఆ జిల్లా పరాకాష్ట... కరెంట్​ షాక్​తో రైతు మృతి

By

Published : Aug 18, 2020, 2:17 PM IST

నల్గొండ జిల్లాలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మనుషులు, జంతువులు విద్యుదాఘతానికి బలవుతున్నారు. తాజాగా జిల్లాలోని కనగల్ మండలంలోని రెడ్డి గూడెం గ్రామానికి చెందిన రైతు అంజి రెడ్డి ఉదయం తన బావి వద్ద ట్రాన్స్ పార్మర్ ప్యూజ్ వేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్​కు గురై మృతి చెందారు. ఎన్నిసార్లు ప్రమాదాల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ మార్పు లేదు.

ఎక్కడ చూసినా అవే ఘటనలు...

జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇవే సంఘటనలు జరుగుతున్నాయని విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఏ గ్రామంలో చూసినా కనీసం జాగ్రతలు తీసుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు విద్యుత్ నియంత్రికల (ట్రాన్స్​ఫార్మర్​) చుట్టూ ఎలాంటి కంచే లేకుండా ఉంటున్న దాఖలాలు కోకొల్లలు. కొన్ని చోట్ల స్విచ్​లు సైతం ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఫలితంగా ప్రజా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

ఇవీ చూడండి : ఇన్​స్పెక్టర్​ను సస్పెండ్ చేసిన సీపీ అంజనీకుమార్

ABOUT THE AUTHOR

...view details