సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు తనిఖీలు నిర్వహించి... 313 మందిపై కేసులు నమోదు చేశారు. 228 ద్విచక్ర వాహనాలు, 69 కార్లు, 11 ఆటోలు, 5 లారీలను స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల నుంచి ప్రతిరోజు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతున్నట్లు డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... పలువురిపై కేసులు - సైబరాబాద్లో తనిఖీలు
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు... వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల నుంచి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... పలువురిపై కేసులు