మావోయిస్టుల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లాలోని తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈనెల 21 నుంచి 28 వరకు సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు భారీ ఎత్తున అడవుల్లోకి వెళ్లి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
బోల్తా పడిన డీఆర్జీ దళాల బస్సు.. తప్పిన ప్రమాదం - మావోల సంస్మరణ వాారోత్సవాలు
ఖమ్మం జిల్లాలోని తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో కూంబింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న డీఆర్జీ దళాల బస్సు వాగులో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది.

బోల్తా పడిన డీఆర్జీ దళాల బస్సు.. తప్పిన ప్రమాదం
ఈ క్రమంలో కూంబింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న సమయంలో బీజాపూర్ జిల్లా కేంద్రానికి సమీపంలో వాగు దాటుతుండగా.. డీఆర్జీ దళాల బస్సు వాగులో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది.
ఇదీచూడండి.. మంత్రి కేటీఆర్‌పై సుమేధ తల్లిదండ్రుల ఫిర్యాదు