వరకట్న వేధింపుల కింద నమోదైన ఓ కేసులో గుంటూరు పట్టణ మహిళా ఠాణా పోలీసులు నలుగురు చిన్నారుల పేర్లను చేర్చటంపై ఏపీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. తమ పిల్లలపై నమోదైన కేసును కొట్టివేయాలని చిన్నారులకు సంబంధించిన పెద్దలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా చంద్రాపురానికి చెందిన పి.బిందుకు ఇటీవల వివాహం జరిగింది. ఆమె భర్త, అత్తమామ, ఆడపడచులు, వారి భర్తలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఈ ఏడాది సెప్టెంబరు 26న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
చిన్నారులపై వరకట్నం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన పెద్దలు - dowry case in ap
వరకట్న వేధింపుల ఆరోపణలతో దాఖలైన కేసులో.. చిన్నారులపైనా అభియోగాలు నమోదయ్యాయి. ఇది అధికార దుర్వినియోగమే అని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు.
అందరిపై వరకట్న వేధింపులు, భారత శిక్షా స్మృతి సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేశారు. వారితో పాటు 6, 9, 11 ఏళ్ల వయసున్న ఆడపడచుల కుమారులు, కుమార్తెలనూ నిందితులుగా చేర్చారు. తమతో పాటు చిన్నారులపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిన్న పిల్లలను నిందితులుగా చేర్చటం అధికారాన్ని దుర్వినియోగ పర్చటమేనని పిటిషన్లో పేర్కొన్నారు. తమకు సంబంధం లేకపోయినా పోలీసులు... కేసు నమోదు చేశారని ఆరోపించారు.
ఇదీ చూడండి:గ్యాస్‌తో ముఖాన్ని కాల్చి... గొంతు నులిపి చంపేశాడు