కోవిడ్ టీకా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ చరవాణులకు వచ్చే సందేశాలను నమ్మవద్దని సైబర్ క్రైం పోలీసులు సూచించారు. ఈ రకంగా వచ్చే సందేశాలు, ఫోన్ కాల్స్ నకిలీవని స్పష్టం చేశారు.
'కోవిడ్ టీకా రిజిస్ట్రేషన్ సందేశాలను నమ్మవద్దు' - hyderabad cyber fake covid vaccine crime news
కోవిడ్ టీకా రిజిస్ట్రేషన్ అంటూ చరవాణులకు వచ్చే సందేశాలను నమ్మవద్దని సైబర్ క్రైం ఏసీపీ హరినాథ్ స్పష్టం చేశారు. టీకా గురించి ప్రభుత్వ మార్గదర్శకాలు వచ్చే వరకు ఎటువంటి సందేశాలను పట్టించుకోవద్దని సూచించారు.
'కోవిడ్ టీకా రిజిస్ట్రేషన్ సందేశాలను నమ్మవద్దు'
రిజిస్ట్రేషన్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ సైబర్ క్రైం ఏసీపీ హరినాథ్ తెలిపారు. ఇందుకోసం కొందరు సైబర్ నేరగాళ్లు రూ. 2 నుంచి 4 వేల వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. టీకా కోసం ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చే వరకు ఎటువంటి సందేశాలను పట్టించుకోవద్దని హరినాథ్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:గుడిలో 40 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్