సికింద్రాబాద్ తుకారంగేట్ ఠాణా పరిధిలో వీధికుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. స్నేహితులతో కలిసి ఇంటి ముందు ఆడుకుంటున్న చిరంజీవిపై గుంపుగా వచ్చిన కుక్కలు దాడిచేశాయి. బాలుడిని సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా... అక్కడ నుంచి నిలోఫర్‌కు తీసుకెళ్లారు.
వీధి కుక్కల స్వైర విహారం... ముగ్గురు చిన్నారులకు గాయాలు - తెలంగాణ తాజావార్తలు
తుకారం గేట్ ఠాణా పరిధిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. వేర్వేరు చోట్ల ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులపై దాడి చేశాయి. ఘటనలో ఓ పిల్లాడు తీవ్రంగా గాయపడగా... మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి.
![వీధి కుక్కల స్వైర విహారం... ముగ్గురు చిన్నారులకు గాయాలు వీధి కుక్కల స్వైర విహారం... ముగ్గురు చిన్నారులకు గాయాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8804791-291-8804791-1600146516439.jpg)
వీధి కుక్కల స్వైర విహారం... ముగ్గురు చిన్నారులకు గాయాలు
అక్కడ నుంచి వెళ్లిన శునకాలు అడ్డగుట్ట శాస్త్రినగర్‌లో ఇద్దరు చిన్నారులపై దాడి చేసి గాయపరిచాయి. స్వల్పంగా గాయపడిన పిల్లలను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కుక్కల బెడద ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:చెరువులో చిన్నారుల మృతదేహాలు.. అపస్మారక స్థితిలో తల్లి, మరో వ్యక్తి!