తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇలా కూడా మోసం చేస్తారా? - customs officers

కాదేదీ కవితకనర్హం అన్నచందంగా... కాదేదీ మోసానికి అనర్హం అంటూ రోజుకో రకంగా అక్రమాలకు తెగబడుతున్నారు కేటుగాళ్లు. విమానాశ్రయంలో కస్టమ్స్​ అధికారుల నుంచి తప్పించుకునేందుకు  కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఎన్ని ఎత్తులు వేసినా పోలీసుల చాకచక్యంతో పట్టుబడుతున్నారు.

ఎంత మోసం.. ఎంత మోసం

By

Published : Mar 13, 2019, 9:17 PM IST

Updated : Mar 13, 2019, 11:09 PM IST

ఎంత మోసం.. ఎంత మోసం

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ. 26 లక్షల విలువైన 809 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌ కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ నేతృత్వంలో అధికారులు బుధవారం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన వారి వస్తువులను తనిఖీ చేశారు. ఓ ప్రయాణికుడి వస్తువులను స్కాన్​ చేయగా బంగారం ఉన్నట్లు గుర్తించారు.

పాప్​కార్న్​ తయారీ ఉపకరణంలో

ఎవ్వరికీ అనుమానం రాకుండా పాప్‌కార్న్‌ తయారీ ఉపకరణంలో అడుగు భాగాన దాచిన బంగారాన్ని గుర్తించారు. దాన్ని వెలికి తీసి స్వాధీనం చేసుకున్నారు. మాయగాళ్లు ఎన్ని కొత్త మార్గాలు అన్వేషించి మోసాలకు ప్రయత్నించినా పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు.

ఇవీ చదవండి:కోటి రూపాయల డ్రగ్స్​ పట్టివేత

Last Updated : Mar 13, 2019, 11:09 PM IST

ABOUT THE AUTHOR

...view details