వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నేపల్లిలో చోటుచేసుకొంది.
చిట్యాల మండలం వెలిమినేడు చెందిన యువకులు.. వలిగొండ మండలం గొల్నేపల్లిలో ఓ వివాహ బరాత్ కోసం డీజే బాక్సులను వ్యాన్లో తీసుకెళ్లారు. గొల్నేపల్లి సమీపానికి వచ్చేసరికి వ్యాన్ అదుపు తప్పి కాలువలో పడింది.