తెలంగాణ

telangana

బీజేవైఎం రహదారి దిగ్బంధం.. ఉద్రిక్తం

ప్రైవేటు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం చేపట్టిన రహదారి దిగ్బంధ కార్యక్రమాన్ని జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

By

Published : Dec 29, 2020, 7:01 PM IST

Published : Dec 29, 2020, 7:01 PM IST

District police blocked a road blockade by the bjym in jogulamba
రహదారి దిగ్బంధ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు

లాక్ డౌన్ కారణంగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రైవేట్ టీచర్స్​, లెక్చరర్లకు తక్షణం గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోవాలి బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం చేపట్టిన రహదారి దిగ్బంధాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

జోగులాంబ గద్వాల పట్టణంలోని డీకే అరుణ నివాసం నుంచి ర్యాలీగా వస్తున్న బీజేవైఎం నాయకులను గద్వాల టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టగా.. ఆందోళనకారుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ముందు బీజేవైఎం నాయకులు నిరసన చేపట్టారు.

తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన 2 లక్షల ఉద్యోగాల ప్రకటన వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి డిమాండ్​ చేశారు. నిరుద్యోగులకు తక్షణం నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు.

ఇదీ చూడండి:కోపంతో రగిలిన కోడలు... అత్త ముక్కు కొరికేసింది..

ABOUT THE AUTHOR

...view details