దిశ ఘటన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ చిత్రీకరిస్తున్న సినిమాను వెంటనే నిలిపేయాలని దిశ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఇప్పటికే యూట్యూబ్లో ఉంచిన చిత్రం ట్రైలర్ను కూడా తొలగించాలని కోరారు. ఈ మేరకు సీసీఎస్ సంయుక్త సీపీ అవినాశ్ మెహంతికి వినతిపత్రం అందించారు.
ఆ కామెంట్లతో మానసిక క్షోభ అనుభవిస్తున్నాం: దిశ తల్లిదండ్రులు - సీసీఎస్ సీపీకి దిశ తల్లదండ్రుల వినతిపత్రం
దిశ ఎన్కౌంటర్ ట్రైలర్ను యూట్యూబ్లో నుంచి తీసేయాలని, సినిమా చిత్రీకరణను ఆపేయాలని... దిశ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీసీఎస్ సంయుక్త సీపీ అవినాశ్ మెహంతికి వినతిపత్రం అందించారు.
ఆ కామెంట్లతో మానసిక క్షోభ అనుభవిస్తున్నాం: దిశ తల్లిదండ్రులు
దిశ ఎన్కౌంటర్ ట్రైలర్ను యూట్యూబ్లో చూసిన వాళ్లు పెడ్తున్న కామెంట్లు... తమను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని దిశ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దిశ హత్యాచారానికి గురైన రోజే సినిమా విడుదల చేసే ఉద్దేశంలో రాంగోపాల్ వర్మ ఉన్నారని... ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దిశ కుటుంబ సభ్యులు కోరారు. ఈ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ... దిశ నిందితుల తల్లిదండ్రులు కూడా న్యాయ కమిషన్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.