కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సోమ్లా నాయక్ తండాకి చెందిన బాదావత్ శ్రీనివాస్(28) చెరువులో పడి మృతి చెందాడు. శ్రీనివాస్ ఇంటి వద్దే ఉంటూ గొర్రెలు, మేకలను పోషించుకుంటూ జీవనం సాగించేవాడు.
కనిపించకుండా పోయి.. చెరువులో తేలిన మృతదేహం - ఆందోళన చెందిన కుటుంబసభ్యులు
మేకల కాపరి గొర్రెలు మేపడానికి మంగళవారం వెళ్లి తిరిగిరాలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆరా తీశారు. తీరా ఓ గ్రామంలోని చెరువు పక్కన అతని బట్టలు కనిపించాయి. చెరువులో వెతకగా అతని మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.
కనిపించకుండా పోయి.. చెరువులో తేలిన మృతదేహం
మంగళవారం మధ్యాహ్నం గొర్రెలు మేపడానికి పక్క గ్రామం బూర్గుల వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు ఆరా తీయగా బూర్గుల గ్రామ శివారులో ఊర చెరువు కుంట దగ్గర అతని దుస్తువులు కనిపించాయి. ఆ కుంటలో వెతకగా నీటిలో అతని మృత దేహం లభ్యమైంది. అతని భార్య సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి :ఎస్సార్ నగర్లో కరెంట్ షాక్ తగిలి.. బార్ క్యాషియర్ మృతి