తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఒకే రోజు ఒకే ప్రాంతం... మూడు వేర్వేరు ప్రమాదాలు.. - ఖమ్మం జిల్లా నేర వార్తలు

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఒకేరోజు మూడు వేర్వేరు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరికొందరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

different-incidents-at-karepalli-mandal-in-khammam-district-one-person-dead
ఒకే రోజు ఒకే ప్రాంతం... మూడు వేర్వేరు ప్రమాదాలు..

By

Published : Sep 30, 2020, 12:26 PM IST

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాదారం పరిధిలోని మంగలి తండా గ్రామ శివారులో పిడుగు పడి నాలి లక్ష్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదిలా ఉండగా కారేపల్లి క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనంపై వస్తున్న భార్యాభర్తలను గుర్తుతెలియని కారు ఢీ కొట్టింది. ఈఘటనలో ఏడు నెలల గర్భిణి అయిన రమాదేవి గాయాలతో సొమ్మసిల్లి పడిపోగా.. భర్త భాస్కర్ వారి కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఖమ్మం వైద్యశాలకు తరలించారు. ఎస్సై సురేష్ కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

ఆటోను తప్పించబోయి...

కోటమైసమ్మ మూలమలుపు వద్ద ఆటోను తప్పించబోయి రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో అనిల్, చంద్రశేఖర్, రాజ్​కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు గాయపడగా వారికి ఇల్లందు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి... మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఇలా ఒకే రోజు మూడు ప్రమాదాలు జరగడం వల్ల మండల వాసులు విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:భర్తను కాపాడి ప్రాణాలు విడిచిన భార్య

ABOUT THE AUTHOR

...view details