తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తీర్పు కోసం వచ్చి అంతిమ లోకాలకు - తీర్పు కోసం వచ్చి అంతిమ లోకాలకు

తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు అయింది ఈ అభాగ్యుని పరిస్థితి. నష్టపరిహారం కోసం కోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి విచారణ పూర్తికాకుండానే న్యాయస్థానం ఆవరణలోనే మృతి చెందాడు.

విచారణ కోసం వచ్చి కోర్టు వద్దనే మృతి

By

Published : Mar 19, 2019, 7:18 PM IST

విచారణ కోసం వచ్చి కోర్టు వద్దనే మృతి
కరీంనగర్ జిల్లా కాటారం మండలం శంకరంపల్లెకు చెందిన శ్యామల లక్ష్మయ్య విచారణ నిమిత్తం జిల్లా కోర్టుకు వచ్చాడు. విచారణ పూర్తి కాకుండానే అనారోగ్యంతో న్యాయస్థానం ఆవరణలో మృతిచెందాడు. లక్ష్మయ్య కుమారుడు రవీందర్ 2017లో కొండన్నపల్లిలో జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందాడు. పరిహారం కోరుతూ రవీందర్​ భార్య స్వప్న దావా వేసింది.

నష్ట పరిహారం కోసం పోరాటం

విచారణ జరిపిన లోక్​ అదాలత్ స్వప్నకు 7 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తంలో 2 లక్షల రూపాయలు తనకు రావాలని లక్ష్మయ్య మార్చి 8న కోర్టులో పిటిషన్ వేశాడు. 18న విచారణ జరగాల్సి ఉండగా న్యాయమూర్తి అందుబాటులో లేకపోవటం వల్ల వాయిదా పడింది. నేడు విచారణకు వచ్చి కోర్టు ఆవరణలోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేటప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

ABOUT THE AUTHOR

...view details