తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన డయల్​ 100

డయల్ 100కు కాల్​ చేయడం వల్లే ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడి, సీసీ కెమెరాల ఆధారంగా నిందితున్ని పట్టుకున్నామని హైదరాబాద్​ సుల్తాన్​​బజార్ పోలీసులు తెలిపారు. ప్రతి ఒక దుకాణాదారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

dial 100 save one person life at sultan bazar koti hyderabad
ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన డయల్​ 100

By

Published : Aug 3, 2020, 11:46 PM IST

వట్టేపల్లికి చెందిన ఎస్​కే అర్బాజ్ అహ్మద్.. గత నెల 31న హైాదరాబాద్​ సుల్తాన్ బజార్ డయల్​ 100కు కాల్ చేశాడు. దేనా బ్యాంక్ సుల్తాన్ బజార్ బ్యాంక్ స్ట్రీట్ కోఠి రోడ్డు మీద గొడవ జరుగుతుంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడని... అతనికి తీవ్రమైన గాయాలు అయ్యాయని చెప్పాడు. సకాలంలో స్పందించిన పోలీసులు గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారని సుల్తాన్ బజార్ పోలీసులు తెలిపారు.

గాయపడ్డ వ్యక్తిని పోలీసులు విచారించగా... తన పేరు గనప రాజేశ్ అని.. గుజరాతి గల్లీలో పార్కింగ్ డ్యూటీ చేస్తానని.. డ్యూటీ ముగుంచుకుని తన అన్న రాకేశ్​తో కలిసి దేనా బ్యాంక్ స్ట్రీట్ దాటి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడని చెప్పాడు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు కింగ్ కోఠికి చెందిన ఎస్​డీ సద్దాంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడు రౌడీషీటర్​ అని విచారణలో గుర్తించారు.

సకాలంలో సమాచారం, సీసీ కెమెరాలతో...

సకాలంలో 100కు సమాచారం ఇవ్వడం వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడామని... కేవలం సీసీ కెమెరాల ఆధారంగానే నిందితుడిని గుర్తించామని పోలీసులు వివరించారు. సీసీ దృశ్యాలు ఇచ్చి దర్యాప్తుకు సహకరించిన బ్రదర్స్ క్లాత్ షాప్ ఓనర్ సందీప్ కుమార్​ను సన్మానించారు. ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని... అలాగే ఏదైనా సంఘటన జరిగితే వెంటనే డయల్​ 100కి సమాచారం ఇవ్వాలని దుకాణాదారులకు విజ్ఞప్తి చేశారు.

ఇవీచూడండి:పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details