తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వైస్​ ఎంపీపీ వివాహేతర సంబంధం.. దిష్టిబొమ్మ దగ్ధం - nagarkurnool district latest news

ఓ వైస్​ ఎంపీపీ.. అతని వద్ద పని చేసే సహాయకుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రశ్నించినందుకు అతడిని తన్ని తరిమేశాడు. భార్యను కాపురానికి పంపాలంటూ అత్త, మామలతో కలిసి అతని ఇంటికి వెళ్తే వారిపైనా దాడి చేశాడు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్థులతో కలిసి ధర్నాకు దిగారు.

dharna against padara vice mpp at padara in nagarkurnool district
వైస్​ ఎంపీపీ వివాహేతర సంబంధం.. దిష్టిబొమ్మ దగ్ధం

By

Published : Dec 11, 2020, 4:41 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా పదర మండల కేంద్రంలో స్థానిక వైస్ ఎంపీపీ వరుణ్ కుమార్​కు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఏమైందంటే..

నాగర్​ కర్నూల్ జిల్లా పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన మాదాసి కురువ పాలెంకయ్య, సుగుణమ్మల కుమార్తె వీరలక్ష్మిని హైదరాబాద్​కు చెందిన చరణ్​కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతులిద్దరూ గత కొంతకాలంగా హైదరాబాద్​లో ఉండే పదర మండల వైస్ ఎంపీపీ వరుణ్ కుమార్ వద్ద ఫౌల్ట్రీలో సహాయకులుగా పని చేస్తున్నారు. కాగా వైస్ ఎంపీపీ వరుణ్​కుమార్​కు చరణ్ భార్య వీరలక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వైస్​ ఎంపీపీ చరణ్​ను, అతని పిల్లలను కొట్టి తరిమేశాడు.

తన భార్యను కాపురానికి పంపడం లేదంటూ తన అత్త మామలను తీసుకుని వరుణ్​ కుమార్​ వద్దకు వెళ్లగా వారి మీదా దాడి చేశాడు. ఈ క్రమంలోనే బాధిత కుటుంబ సభ్యులు, వంకేశ్వరం గ్రామస్థులు వైస్ ఎంపీపీకి నిరసనగా ధర్నా చేపట్టారు. ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఓ ప్రజాప్రతినిధి ఇలా చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి: పాలదుకాణంలో చోరీ.. సీసీటీవీలో దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details