తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఈ ఏడాదిలో నేరాలు తగ్గాయ్.. మరింత మెరుగుపడ్డాం: డీజీపీ

రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అన్నిరకాల నేరాలు తగ్గాయని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. 2020 రాష్ట్ర వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. రాష్ట్రంలోకి ప్రవేశించాలని మావోయిస్టుల ప్రణాళికల్ని విజయవంతంగా భగ్నం చేశామని మహేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. డయల్ 100కు ఫోన్ వస్తే జీపీఎస్​ ద్వారా సగటున 8 నిమిషాల్లో గస్తీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలకు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు.

dgp mahendar reddy release state annual crime report in hyderabad
ఈ ఏడాదిలో నేరాలు తగ్గాయ్.. మరింత మెరుగుపడ్డాం: డీజీపీ

By

Published : Dec 30, 2020, 1:29 PM IST

Updated : Dec 30, 2020, 3:36 PM IST

రాష్ట్రవ్యాప్తంగా నేరాలు 6 శాతం తగ్గాయని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. వార్షిక నేర గణాంకాలను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్‌లో విడుదల చేశారు. హత్యలు 8.5 శాతం, మహిళలపై నేరాలు 1.9 శాతం తగ్గినట్లు మహేందర్‌రెడ్డి వివరించారు. రహదారి ప్రమాదాలు 13.9 శాతం, వైట్‌కాలర్ నేరాలు 42 శాతం తగ్గుముఖం పట్టాయన్నారు. 48.5 శాతం మంది నేరస్థులకు శిక్ష పడిందని... రికార్డు స్థాయిలో నలుగురు దోషులకు ఉరిశిక్ష పడటం రాష్ట్ర పోలీసుల పనితీరుకు నిదర్శమని వ్యాఖ్యానించారు.

ఆ లక్ష్యం కోసం పని చేస్తున్నాం

ఫంక్షనల్‌ వర్టికల్‌ సిస్టం అమలు ద్వారా పోలీసుల పనితీరు మెరుగుపరిచినట్లు డీజీపీ చెప్పారు. ప్రజలకు మరింత సులువుగా అందుబాటులో ఉండేలా సామాజిక మాధ్యమాలు వాడుతున్నామన్నారు. నేరరహిత, మావోయిస్టురహిత తెలంగాణ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. డయల్ 100కు ఫోన్ వస్తే 8 నిమిషాల్లో గస్తీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయని తెలిపారు. ఈ ఏడాది 12 లక్షలకుపైగా కాల్స్‌ వచ్చినట్లు వివరించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదుల స్వీకరణ కూడా ఈ ఏడాది పెరిగినట్లు డీజీపీ చెప్పారు.

ఆ దర్యాప్తు దేశానికి ఆదర్శం

రుణ యాప్స్‌ల ఆగడాలపై దర్యాప్తు జరుగుతోంది. చైనా సహా విదేశీయుల హస్తం ఉంటడంతో మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. యాప్స్ నిర్వహకుల వేధింపులపై కేసులు వచ్చిన వెంటనే రాష్ట్ర పోలీసులు స్పందించిన తీరు... దేశవ్యాప్తంగా పోలీసులకు ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 6.65 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే 99 వేల కెమెరాలు ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాల ద్వారా 4,490 కేసులు పరిష్కరించాం. 13 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.

- మహేందర్​ రెడ్డి, డీజీపీ

షీటీమ్స్‌ ఏర్పాటుతో మహిళల్లో భద్రతా భావం కల్పించామని డీజీపీ తెలిపారు. 4,855 ఫిర్యాదులు అందాయని వివరించారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న 350 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు స్పష్టంచేశారు.

ఇదీ చూడండి:2020 రౌండప్ ​: రాజధానిలో సంచలనం సృష్టించిన కేసులివే..!

Last Updated : Dec 30, 2020, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details